Sunday, May 12, 2024

రేపటి నుంచి బ్రిటన్‌లో టీకాలు..!

- Advertisement -
- Advertisement -

Vaccines in Britain from tomorrow

 

బ్రిటన్ రాణి, రాజుకు మొదటి టీకా..!!

లండన్: బ్రిటన్‌లో కొవిడ్19ను నియంత్రించే వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు మొదటి టీకాల్ని ఇవ్వనున్నారు. బ్రిటన్ రాణి ఎలిజెబెత్(94), రాజు ఫిలిప్(99) మొదటి టీకాల్ని తీసుకోనున్నారు. ఫైజర్/బయో ఎన్‌టెక్ రూపొందించిన టీకాకు బ్రిటన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. సోషల్ మీడియాలో టీకాల సామర్థ్యంపై వ్యక్తమైన అనుమానాలకు చెక్ పెట్టేందుకే బ్రిటీష్ రాజకుటుంబాన్ని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. మొదటి బ్యాచ్‌లో 8 లక్షల డోసుల్ని బెల్జియం నుంచి బ్రిటన్ తెప్పించింది. 4 కోట్ల డోసుల ఫైజర్ టీకాలకు బ్రిటన్ ఆర్డరిచ్చింది. ఈ టీకాను 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మొదటి దశలో బ్రిటన్‌లోని రెండు కోట్లమందికి టీకాలు వేయనున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలకు కూడా మొదటి దశలో టీకాలు ఇవ్వనున్నారు. ఈ టీకాను మైనస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేయాలి. మొదటి దశలో 50 ఆస్పత్రుల్లో ఫ్రీజింగ్ సౌకర్యం కల్పించారు. ఇంకా ఇతర కంపెనీలతో కలిపి మొత్తం 30 కోట్ల డోసులకు బ్రిటన్ ఆర్డరిచ్చింది. వాస్తవానికి బ్రిటన్ జనాభాకు( ఏడు కోట్ల జనాభాకు) అన్ని డోసులు అవసరం లేదు. ఏది ముందు వస్తే దానిని ఇవ్వాలన్న ప్రణాళికతో ఆర్డరిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News