Monday, April 29, 2024

మార్చి 17న వరుణ్ తేజ్ ‘గని’..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. ఈ సినిమాలో బాక్సర్‌గా చేస్తున్న వరుణ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో జగపతి బాబు, సునీల్ శెట్టి, తమన్నా భాటియా, ఉపేంద్ర, నదియా, నవీన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అల్లు బాబి, సిద్ధు ముద్ద నిర్మిస్తున్న మూవీని కొత్త డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 24న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని మేకర్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా చిత్రయూనిట్ ఈ మూవీ కొత్త విడుదల తేదిని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చ్ 17వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ సినిమాకు థమన్ సంగీత అందిస్తున్నాడు.

Varun Tej’s Ghani to release on March 17

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News