Saturday, April 27, 2024

వచ్చే ఏడాదిలో వాహన ధరలు మరింత ప్రియం

- Advertisement -
- Advertisement -
Vehicle prices rise further next year
ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే..

న్యూఢిల్లీ : భారతదేశ ఆటోమొబైల్ కంపెనీలు అమ్మకాలు, ఆదాయంలో సాధారణ స్థితిని సాధించడానికి చాలా కాలం పట్టే అవకాశముంది. పండగ సీజన్‌లో అమ్మకాలు ఊపందుకున్నప్పటికీ ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల్లో ప్రయాణీకుల వాహనాల డిమాండ్ తక్కువగా ఉంటుందని అంచనా. ఉత్పత్తి, వస్తువుల ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి తయారీదారులు కూడా వాహన ధరలను పెంచాలని భావిస్తున్నారు. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల టోకు 30 శాతం తగ్గవచ్చు. మరోవైపు, ట్రాక్టర్ విభాగం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉత్తమ పనితీరును కనబరిచింది. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ వ్యవసాయ యంత్రాలకు అనువైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ పెరిగింది. అమ్మకాలు 2020 డిసెంబర్ 2021 ఫిబ్రవరి మధ్య తగవచ్చని, మళ్లీ 2021 మార్చి నుండి వేగవంతం అవుతాయని అంచనా. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ట్రాక్టర్ల హోల్‌సేల్ 16 శాతం పెరుగుతుందని అంచనా.

Vehicle prices rise further next year

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News