Monday, April 29, 2024

సుప్రీంకోర్టు తీర్పుకు ఇది విరుద్ధం

- Advertisement -
- Advertisement -
Verdict counter to SC judgment says Congress
ప్రత్యేక కోర్టు తీర్పుపై కాంగ్రెస్

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 9న వెలువరించిన తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్లి, నిష్పాక్షికంగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని అనుసరించాలని కేంద్రం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ బాబ్రీ మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది నవంబర్ 9న ఇచ్చిన తీర్పులో స్పష్టంగా అభిప్రాయపడిందని అన్నారు. అయితే ప్రత్యేక సిబిఐ కోర్టు మాత్రం నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిందని, సుప్రీంకోర్టు నిర్ణయానికి విరుద్ధంగా ప్రత్యేక కోర్టు తీర్పు ఉందని ఆయన చెప్పారు. ఏదో విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న దుర్బుద్ధితో దేశంలో మతసామరస్యాన్ని, సోదరభావాన్ని దెబ్బతీయడానికి బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ పన్నిన రాజకీయ కుట్రను యావద్దేశ ప్రజలు చూశారని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News