Sunday, April 28, 2024

మాజీ మంత్రి వీరమణి ఇళ్లపై విజిలెన్స్ దాడులు

- Advertisement -
- Advertisement -

Vigilance raids on former minister Veeramani's house

చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణపై ఎఐడిఎంకె మాజీ మంత్రి కె.సి. వీరమణి ఇళ్లపై గురువారం విజిలెన్స్ దాడులు జరిగాయి. వీరమణికి చెందిన ఇరవై ఉళ్లలో, ప్రాంతాల్లో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డివిఎసి) అధికార వర్గాలు సోదా చేశాయి. తిరుపత్తూర్ జిల్లా లోని వీరమణి స్వగ్రామం జొలార్ పట్టైలో కూడా సోదాలు జరిగాయి. 2016 21 మధ్యకాలంలో ఎఐడిఎంకె ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల మంత్రిగా వీరమణి పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి 600 శాతం అధికంగా రూ. 28 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్టు డివిఎసి ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. ఈ సోదాలు డిఎంకె పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగిస్తున్న కక్షసాధింపు చర్యలేనని ఎఐడిఎంకె నేతలు పన్నీర్‌సెల్వం, కె. పళనిస్వామి తదితరులు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News