Friday, April 26, 2024

నిర్భయ హంతకుడు వినయ్ శర్మను జైలులో హింసించారు: న్యాయవాది

- Advertisement -
- Advertisement -

Vinay-Sharma

న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో హంతకులలో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించే సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అతడి సామాజిక దర్యాప్తు నివేదికను, వైద్య నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని హంతకుడి తరఫు న్యాయవాది గురువారం సుప్రీంకోర్టుకు తెలియచేశారు. తీహార్ జైలులో వినయ్ శర్మను చట్టవిరుద్ధంగా బంధించి, చిత్రహింసించారని న్యాయవాది ఆరోపించారు. తాను న్యాయం కోసం అర్థిస్తున్నానని, హంతకులేమీ ఉగ్రవాదులు కారని, నేరాలు చేయడమే వారి ప్రవృత్తి కాదని, ఈ కారణాలతో వారికి క్షమాభిక్ష ప్రసాదించవచ్చని న్యాయవాది ఎపి సింగ్ వాదించారు.

మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వినయ్ శర్మకు సరైన వైద్య చికిత్స అందచేయవలసి ఉందని ఆయన చెప్పారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వినయ్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని అతను తన న్యాయవాది ద్వారా కోర్టును అర్థించాడు. ఫిబ్రవరి 1న వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే.

Vinay Sharma was illegally tortured, tells Lawyer, Nirbhaya gang rape convict was facing trauma due to poor mental health, says his lawyer to SC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News