Saturday, April 27, 2024

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన

- Advertisement -
- Advertisement -

మైనంపల్లి కెటిఆర్‌పై చేసిన విమర్శలపై…
సిఈఓ వికాస్ రాజ్ ను కలిసిన బిఆర్‌ఎస్ లీగల్ సెల్ టీమ్

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని, కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలపై సిఈవో వికాస్‌రాజ్‌కు బిఆర్‌ఎస్ లీగల్ సెల్ బృందం ఫిర్యాదు చేసింది. శనివారం బిఆర్‌ఎస్ లీగల్ సెల్ బృందం నేత సోమా భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఆరు అంశాలతో పాటు మైనంపల్లి హన్మంతరావు కెటిఆర్ పై చేసిన విమర్శలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కర్నాటకలో ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజల సొమ్ముతో తెలంగాణలో ప్రకటనలు ఇస్తున్నారని ఇది పూర్తిగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లేనన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్యారెంటీ కార్డుల పంపిణీ చేస్తూ ఎన్నికల నిబంధనలు పాటించడం లేదన్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారంలో మాట్లాడే భాషపై మరోసారి ఫిర్యాదు చేసి 11 వీడియోలు సిఈవో అందజేసినట్లు చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తమ పార్టీ ప్రజా ప్రతినిధులు 32 మందిని కొనుగోలు చేసి వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి లక్షల రూపాయలు జమ చేశారని పేర్కొన్నారు. సరైన సమయంలోనే ఎలక్షన్ కమిషన్ తన అధికారాలను ఉపయోగించి చర్యలు తీసుకోవాలని కోరామని, తీసుకోకపోతే కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. మంత్రి కెటిఆర్ ఇంటర్వ్యూల గురించి ముందస్తు అనుమతి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి వెళ్లి ఆపార్టీ అరాచకాలను వివరిస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News