Saturday, May 4, 2024

‘విరాటపర్వం’ పునః ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Virat parvam movie shooting start

వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి తదితరులు నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. డి.సురేష్‌బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభమైంది. ప్రస్తుతం రాత్రిపూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ‘విరాటపర్వం’ సినిమాకు సంబంధించిన నైట్ షూటింగ్ వీడియోను రానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 90వ దశకంలో తెలంగాణలోని నక్సల్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News