Saturday, April 27, 2024

ఉక్రెయిన్‌పై తిరిగి ప్రైవేటు ఆర్మీదాడి? పుతిన్ ప్రిగోజిన్ రహస్య భేటీ

- Advertisement -
- Advertisement -

కీవ్ : రష్యాలో విఫల తిరుగుబాటు అనంతరం అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తిరుగుబాటు వాగ్నర్ నేత యెవెజెని ప్రిగోజిన్‌ను కలిశారు. వీరి మధ్య ఏకాంత చర్చ జరిగిందని ఉక్రెయిన్ అధికార ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ సోమవారం తెలిపారు. మూడుగంటల పాటు గత నెల 29న వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా కొందరు ప్రిగోజిన్ సన్నిహిత సైనికాధికారులు కూడా ఉన్నారని పెస్కోవ్ వెల్లడించారు. వాగ్నర్ ప్రైవేటు సైన్యం రష్యా సేనలతో పాటు కలిసి ఉక్రెయిన్‌పై దాడులకు దిగింది. అయితే ఏకంగా ఈ బృందం అధినేతనే పుతిన్ సైన్యంపై తిరుగుబాటుకు దిగడం, మాస్కో వరకూ ఆయన సేనలు సాగడం,

మధ్యలోనే వెనుతిరిగిపోవడం వంటి పరిణామాలు జరిగాయి. పుతిన్ సైన్యానికి ప్రిగోజిన్‌కు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఆయన తరువాత బెలారస్‌కు ప్రవాసానికి వెళ్లారు. ఇప్పుడు పుతిన్‌తో రహస్య భేటీ జరపడం కీలక పరిణామమని ఉక్రెయిన్ తెలిపింది. పుతిన్ ఇప్పుడు తిరుగుబాటుదార్లతో జరిపిన చర్చల దశలో పూర్తి స్థాయిలో రాజీకి వచ్చినట్లు, వారి తిరుగుబాటుకు కారణాలను తెలుసుకుని, తమ వైపు నుంచి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని తెలియచేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఉక్రెయిన్‌తో మరింత దాడి క్రమంలో ఈ ప్రైవేటు సైన్యం సేవలను తిరిగి మరింత విరివిగా వాడుకుంటామని చెప్పినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News