Saturday, April 27, 2024

కోహ్లి ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి: వివిఎస్ లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

VVS Laxman responds on Kohli Batting mistakes

ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకే రీతిలో ఔట్ కావడంపై మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్పందించాడు. కోహ్లి బ్యాటింగ్‌లో ఓ బలహీనత స్పష్టంగా కనిపిస్తోందని, దాన్ని మార్చుకుంటూనే అతను భారీ పరుగులు చేయగలుగుతాడని పేర్కొన్నాడు. కోహ్లి తన టెక్నిక్‌ను మార్చుకోవాలి. మూడో టెస్టులో కోహ్లి బాగానే ఆడినా అంతకుముందు మ్యాచుల్లో చేసిన తప్పునే చేసి వికెట్ పారేసుకున్నాడన్నాడు. అతనికి చాలా దూరంగా వెడుతున్న బంతులను వెంటాడబోయి కోహ్లి ఔటవువుతన్నాడు. వికెట్‌కు దూరంగా వెళ్లే బంతులను సాధ్యమైనంత వరకు వదిలి పెట్టడమే మంచిదన్నాడు. అనవసరంగా బంతులను వెంటాడి వికెట్‌ను పారేసు కోవడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నాడు. ఆ లోపాన్ని సరిదిద్దుకోనంత వరకు కోహ్లి బ్యాటింగ్ గాడిలో పడడం కష్టమేనని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

VVS Laxman responds on Kohli Batting mistakes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News