Saturday, April 27, 2024

భారత్‌కు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రపంచ బ్యాంకు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ:మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్-19)పై పోరాటం చేస్తున్న భారత్‌కు ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భారత్‌కు ఏకంగా వన్ బిలియన్‌ డాలర్ల అత్యవసర ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ కరోనా ప్రపంచలోని దాదాపు 200 దేశాలకు విస్తరించి హడలెత్తిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. దాదాపు 54 వేల మంది కరోనాతో మరణించారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు కరోనా దెబ్బకు విలవిలాడిపోతున్నాయి. ఇప్పడు భారత్ లోనూ కరోనా విజృంభిస్తోంది. చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తోపాటు కరోనా ప్రభావిత దేశాలకు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న 25 దేశాలకు కేటాయించిన అత్యవసర సహాయ నిధి నుంచి తొలి విడుతగా 1.9 బిలియన్‌ డాలర్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కాగా, ఈ 1.9 బిలియన్ డాలర్లలో భారత్‌కే బిలియన్‌(దాదాపు రూ.7,600 కోట్లు) డాలర్లను కేటాయించింది. స్క్రీనింగ్‌, కాంటాక్ట్‌ కేసుల ట్రేసింగ్‌, ల్యాబొరేటరీ డయాగ్నస్టిక్స్‌, వైద్యుల కోసం పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌, కొత్త ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు వంటి తదితర అవసరాల కోసం ఈ నిధిని మంజూరు చేసినట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.

WB Approves 1 Billion Dollars To India fight for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News