Friday, May 3, 2024

క్రీడాకారులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

Players to practice

 

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. పలు దేశాల్లో కఠినమైన లాక్‌డౌన్‌లను అమలు చేస్తుండడంతో క్రీడాకారులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. రెండు మూడు నెలలుగా సాధన లేక పోవడంతో క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రకటన క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలోనే క్రీడాకారులకు సాధన చేసుకునే అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకుగాను దశల వారిగా చర్యలు చేపడుతామని తెలిపారు. క్రీడాకారులు సాధన ప్రారంభించేందుకు త్వరలోనే కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

అంతేగాక త్వరలోనే తాను దీనికి సంబంధించి క్రీడాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడుతానని మంత్రి వివరించారు. దేశ వ్యాప్తంగా చాలా మంది క్రీడాకారులు సాధన ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే చాలా మంది దీని కోసం కేంద్ర క్రీడ మంత్రిత్వ శాఖకు దరఖాస్తులు కూడా పెట్టుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే అథ్లెట్లు, హాజీ జట్ల సభ్యులతో తాను సమావేశమవుతానని పేర్కొన్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో దేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, దీని ప్రభావం క్రీడాకారులపై కూడా పడిందన్నారు. అయితే త్వరలోనే అన్ని సమస్యలు తీరి పోతాయని, మాములు పరిస్థితులు నెలకొంటాయనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ మంత్రి రిజిజు ఈ విషయాలు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News