Saturday, May 4, 2024

కెనడా ప్రధాని భార్యకు కరోనా

- Advertisement -
- Advertisement -

coronavirus

 

ఒట్టావా: కరోనా వైరస్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సతీమణి సోఫి గ్రెగోరికి సోకిందని ఆ దేశపు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. సోఫికి ప్లూ లక్షణాలు ఉండడంతో వైద్యులు పరీక్షించగా కరోనా సోకినట్టు గుర్తించారు. వెంటనే ఆమె ఇంట్లోని ప్రత్యేక గదిలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన భార్యకు కోవిద్-19 వైరస్ ఉందని తెలియగానే ప్రధాని జస్టిన్ ఇంటి నుంచి పాలన వ్యవహారాలు చూసుకుంటున్నారు. కరోనా లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నాయని ట్రూడో కమ్యూనికేషన్ డైరెక్టర్ కామెరూన్ అహ్మద్ తెలిపారు. సోఫీని కలిసిన వారందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని కామెరూన్ పేర్కొన్నారు. కెనడాలో ఇప్పటి వరకు 138 మందికి కరోనా వైరస్ సోకినట్టు సమాచారం. లండన్  పర్యటన నుంచి కెనడా వచ్చినప్పుడు ఆమెలో ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. లండన్ లోనే ఆమెకు వైరస్ సోకి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటి వరకు 126000 మందికి సోకగా 4613 చనిపోయారని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. 68000 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News