Thursday, May 9, 2024

ప్రియుడి కోసం జైలుకెళ్లింది…

- Advertisement -
- Advertisement -

wife son sentenced to life imprisonment

బెంగళూరు: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష పడిన సంఘటన కర్నాటక రాష్ట్రం ఉడిపిలో జరిగింది. ఈ కేసులో మరో ముగ్గురికి శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భాస్కర్ శెట్టి(50), రాజేశ్వర్ శెట్టి అనే దంపతులు ఉడిపిలో ఉంటున్నారు. భాస్కర్ శెట్టికి ఉడిపిలో పెద్ద హోటళ్లు, లాడ్జ్‌లు ఉన్నాయి. వాటితో పాటు సౌదీ ఆరేబియాలో బిజినెస్ నిర్వహిస్తాడు. జ్యోతిష్యం పిచ్చితో నిరంజన్ భట్ అనే వ్యక్తికి దగ్గరికి రాజేశ్వరి వెళ్లేది. నిరంజన్‌తో రాజేశ్వరికి వివాహేతర సంబంధం పెట్టుకుంది. రాజేశ్వరి తన ఇంట్లో నుంచి పెద్ద మొత్తం నగదు తీసి నిరంజన్ కు  ఇవ్వడంతో ఆమెను పలుమార్లు భర్త మందలించాడు. డబ్బుల విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో భర్తను తొలగించుకోవాలని భార్య నిర్ణయం తీసుకుంది. 2016 జులై 28న భాస్కర్ శెట్టి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు భార్య, నిరంజన్ అతడిపై పెప్పర్ స్ప్రే చల్లి అనంతరం తలపై రాడ్‌తో కొట్టారు. స్పృహ తప్పి పడిపోవడంతో బతికుండగానే కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికారు. శరీర భాగాలను యజ్ఞకుండంలో వేసి పెట్రోల్ పోసి కాల్చారు. అనంతరం మిగిలిన భాగాలను నదిలో పడేశారు. ఈ హత్యలో ఆమె కుమారుడు నవనీత్ శెట్టి(23), నిరంజన్ తండ్రి శ్రీనివాస్ భట్ లు పాలు పంచుకున్నారు. భాస్కర్ శెట్టి తల్లి తన కుమారుడు కనిపించడంలేదని మణిపాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో ఏమీ తేలకపోవడంతో పోలీసులు ఈ కేసును సిఐడికి అప్పగించారు. విచారణలో భాగంగా యజ్ఞకుండంలో ఎముకలను డిఎన్‌ఎ టెస్టుకు పంపించగా భాస్కర్‌ను హత్య చేసినట్టు గుర్తించారు. వెంటనే అతడి భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకుంది. జిల్లా సెషన్స్ కోర్టు నలుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది. డ్రైవర్ రాఘవేంద్రపై ఆధారాలు లేకపోవడంతో అతడిని కేసు నుంచి కోర్టు విముక్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News