Friday, April 26, 2024

ప్రియుడితో ఉండేందుకు అత్తింటికి కన్నంపెట్టి….

- Advertisement -
- Advertisement -

Wife theft gold for Lover in Own house

ఖమ్మం: ప్రియుడితో కలిసి అత్తింటికే కన్నంపెట్టిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కారేపల్లికి చెందిన శివ ప్రకాశ్ దారక్ బంగారం తాకట్టు పెట్టుకొని ఫైనాన్స్ నడుపుతాడు. ప్రకాష్ ధారక్ అతడి భర్యా అర్చన దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్తను వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రకాశ్ తల్లి చనిపోవడంతో అర్చన తన అత్తగారింటికి వచ్చింది. భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. మే 3న ప్రియుడిని కారేపల్లికి పిలిపించుకొని లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలను అతడికి ఇచ్చి నగదు మార్పించాలని చెప్పింది. ఇంట్లో నగలు కనిపించకపోవడంతో ప్రకాశ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అర్చనను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకుంది. ప్రియుడితో కలిసి ఉండేందుకు దొంగతనం చేశానని ఒప్పకుంది. వెంటనే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద 63 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News