Sunday, May 5, 2024

అయ్యప్ప నగల భద్రతపై సుప్రీం ఆదేశాలు పాటిస్తాం: కేరళ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Sabarimala

కొచ్చి : పందళం రాజ భవనం లోని అయ్యప్ప స్వామి నగల భద్రతను మరింత కట్టు దిట్టం చేయాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంతవరకు ఈ నగల సంరక్షకులుగా ఉంటున్న పందళం రాజకుటుంబంలో అంతర్గత కలహాల కారణంగా నగల భద్రతకు సంబంధించిన తగిన ప్రమాణాలు సూచించాలని సుప్రీం కోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నగలు, ఆభరణాలు ఏ కుటుంబానికి చెందినవి కావని, ఇవి అయ్యప్పకే చెందుతాయని, అందువల్ల కుటుంబ వివాదాలు పరిష్కారం అయ్యే వరకు భద్రత పరంగా బాధ్యతాయుతమైన వ్యక్తిని సంరక్షకునిగా నియమించాలని సూచించింది.

కేరళ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ జైదీప్ గుప్తాను నగల భద్రతకు తగిన చర్యలు తీసుకునేలా చూడాలని, ఫిబ్రవరి 7న ఆ వివరాలు తమకు తెలియచేయాలని సుప్రీం సూచించింది. ఈ నగలను తమ భద్రత లోకి తీసుకుంటామని ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని, ఇంకా ఎక్కువ భద్రత కావాలని సుప్రీం ఆదేశించినందున ఆమేరకు చర్యలు తీసుకుంటామని దేవస్థానం మంత్రి కడకమపల్ళై సురేంద్రన్ చెప్పారు. పందళం రాజభవనం ప్రతినిధి ఈ విషయమై మాట్లాడుతూ ప్రస్తుతం పోలీస్ భద్రతలో నగలు ఉన్నాయని, రాజభవనం వారికి దీంతో సంబంధం లేదని చెప్పారు.

Will abide by SC order on Sabarimala Ornaments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News