Thursday, May 9, 2024

రూ.100కోట్లతో టూరిజం స్పాట్ గా రంగనాయక సాగర్…

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: రాబోయే రోజుల్లో రూ.100కోట్ల నిధులతో రంగనాయక సాగర్ ను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసుకోబోతున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. నియోజకవర్గంలోని పట్టణ పరిధిలోని ఒకటవ వార్డ్ లింగారెడ్డి పల్లి గ్రామంలో, చిన్నకోడూర్ మండలంలోని చందల పూర్ గ్రామంలో జరుగుతున్న మహంకాళి అమ్మవారి ఉత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాడు కరువుతో అల్లాడిన ప్రాంతం, త్రాగు నీటికె గోస పడ్డ మన ప్రాంతం.. నేడు కల్పతరువుగా, సాగు, త్రాగు నీరు ఇచ్చే ప్రాంతంగా అవిష్కృతమైంది. రైతులకు కరెంట్, నీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ ది. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చాము. రైతు బంధు, రైతు బీమా ఇస్తూ రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపాము. మన సిద్దిపేట ప్రాంతం గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తూ.. ఒక వైపు సాగు, త్రాగు నీరు ఇస్తున్న రంగనాయక సాగర్ రాబోయే రోజుల్లో రూ.100 కోట్లతో టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసుకోబోతున్నాం.

దేశ విదేశాల్లో తరహాలో డెస్టినేషన్స్, హోటల్స్, వాటర్ హబ్ గా గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుంటాం. చందల పూర్ గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నాం. రంగనాయక స్వామి గుట్టకు సిసి రోడ్డు, 50లక్షలతో రంగనాయక స్వామి, రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధి చేస్కుంటున్నాం. అన్ని వర్గాల పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చాం. లింగారెడ్డి పల్లి గ్రామానికి పట్టణ హంగులు వచ్చాయని, రాబోయే కొద్దీ రోజుల్లో నాలుగు వరసల రహదారి కాబోతోంది.. బట్టర్ ఫ్లై లైట్స్, మధ్యలో డివైడర్ చెట్లతో అద్భుతంగా చేసుకుంటాం. మహంకాళి అమ్మవారి దయతో అందరికి శుభం చేకూరాలి. గత రెండు సంవత్సరాల నుండి కరోనాతో ఉత్సవాలు జరుపులేక పోయాం. ఈ సంవత్సరం గ్రామాల్లో అమ్మవారి ఉత్సవాలు, పండగల జరుపు కుంటున్నాం అని పేర్కొన్నారు.

Will Develop Ranganayaka Sagar as Tourist Spot:Harish Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News