Sunday, May 12, 2024

చిట్టీల పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

Woman Fraud by in the Name of Chits

 

మనతెలంగాణ, హైదరాబాద్ : చిట్టీల పేరుతో, అధిక వడ్డీ ఇస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ మహిళ పరారైన సంఘటన నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిఆర్‌పిఎఫ్ జవాన్‌గా పనిచేసిన బాబూరావు ఉద్యోగ విరమణ తర్వాత చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలోని పటేల్‌నగర్‌లో భార్య అంజలితో ఉంటున్నాడు. అంజలి స్థానికంగా 20 ఏళ్ల నుంచి చిట్టీలు, వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఆమె భర్త సిఆర్‌పిఎఫ్‌లో పనిచేయడంతో క్యాంపస్ ఉద్యోగులు, స్థానికులు భారీ ఎత్తున చిట్టీలు వేశారు. అధిక వడ్డీ ఆశ చూపి స్థానికుల నుంచి దాదాపుగా రూ.15 కోట్లు వసూలు చేసింది.

వాటిని తీసుకుని నిందితురాలి కుటుంబ సభ్యులు పరారయ్యారు. అంజలి కుటుంబ సభ్యులు రెండు రోజుల నుంచి కన్పించకుండా పోవడంతో అనుమానం వచ్చిన చిట్టీలు వేసిన వారు ఫోన్ చేశారు. ఫోన్ కలువకపోవడంతో చిట్టీలు వేసిన వారు, అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు ఇచ్చిన వారు మోసపోయామని గ్రహించి చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కోట్లాది రూపాయలు తీసుకుని నిందితురాలు పరార్ కావడంతో పోలీసులు నగర సిసిఎస్‌కు కేసును బదిలీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News