Tuesday, April 30, 2024

జంతర్ మంతర్ వద్ద మహిళా రైతుల ‘కిసాన్ సంసద్’

- Advertisement -
- Advertisement -

women farmers hold 'Kisan Sansad' at Jantar Mantar

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా దాదాపు 200 మంది ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మహిళా రైతులు సోమవారం ఇక్కడి జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్‌దను నిర్వహించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిత్యావసర వస్తువుల(సవరణ) చట్టం, 2020ను రద్దు చేయాలని, తమ పంటలకు కనీస మద్దతు ధరను కల్పిస్తూ చట్టం చేయాలని వారు ప్రధానంగా డిమాండు చేశారు. మహిళల కిసాన్ సంసద్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాజకీయ నాయకురాలు సుభాషిని అలీ మాట్లాడుతూ రైతులను ఉగ్రవాదులుగా, ఖలిస్తానీలుగా వేర్వేరు పేర్లతో ప్రభుత్వం పిలుస్తోందని, వారికి(ప్రభుత్వం) ధైర్యముంటే ఈ ఉగ్రవాదులు, ఖలిస్తానీలు పండించే ఆహారాన్ని తినకూడదని అననారు. దేశాన్ని సజీవంగా ఉంచుతున్న రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని కార్మిక నేత నీతూ ఖన్నా అన్నారు.

women farmers hold ‘Kisan Sansad’ at Jantar Mantar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News