Saturday, May 11, 2024

కఠినశిక్షణలో ఆరితేరారు

- Advertisement -
- Advertisement -

Women in fire department

 

మహిళలు చొచ్చుకుపోని రంగమంటూ లేదీ రోజుల్లో. అన్నింట్లో వారు అడుగు పెడుతూ, చక్కని సేవలందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. అగ్నిమాపక రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఎగిసిపడే మంటలు, అగ్నికీలలకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు.

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్నిమాపకదళ విభాగంలో 14 మంది మహిళలు సేవలందిస్తున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. వీరంతా కోల్‌కతాలో నాలుగు నెలల ప్రత్యేక శిక్షణను పొందారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు తమ శక్తి సామర్థ్యాలు, పోరాట పటిమను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండే అగ్నిమాపక రంగంలో మహిళలకు అత్యధికంగా ప్రవేశం లభించడం సంతోషంగా ఉందంటున్నారు. మహిళ అంటే ఏంటో నిరూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశంగా చెబుతున్నారు. ఇందులో శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అయినా వాటిని సులువుగా ఎదుర్కొన్నాం అంటున్నారు వీరంతా. ఇప్పటి వరకూ విమానాశ్రయంలోని సిబ్బందిలో 15 శాతం మహిళలే ఉండటం విశేషం. ఈ సంఖ్య ఇంకా పెరగనుంది.

 

Women in fire department
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News