Friday, April 26, 2024

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా అరెస్టు

- Advertisement -
- Advertisement -

Yes bank
ముంబయి: యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ను ఇడి అరెస్టు చేసింది. రానా కపూర్‌పై అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు.  యస్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ నిషేధం తర్వాత రాణా కపూర్‌ను గత రెండు రోజుల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) విచారిస్తోంది. రాణా కపూర్, ఇతరులపై మనీ లాండరింగ్ విచారణలో భాగంగా అతడు విచారణకు సహకరించకపోవడంతోనే ఇడి అరెస్టు చేసింది. వ్యక్తిగత సంబంధాల ఆధారంగా రుణాలు ఇవ్వడంతో పాటు,  రుణాలను ప్రాసెస్ చేసి తిరిగి పొందాలని రాణా కపూర్ నిర్ణయించడంతో యస్ బ్యాంకు సంక్షోభానికి గురైంది.

అనిల్ అంబానీ గ్రూప్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, సిజి పవర్, ఎస్సార్ పవర్, రేడియస్ డెవలపర్స్, మంత్రి గ్రూప్ వంటి వ్యాపార సంస్థలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంక్ ముందుంది. ఈ వ్యాపార వర్గాలు ఎగవేతదారులుగా మారడంతో బ్యాంకుకు ఎదురుదెబ్బ తగిలింది. 2017లో బ్యాంక్ 6,355 కోట్ల రూపాయలను ఎన్‌పిఎలుగా ప్రకటించింది. ఆ తర్వాత ఆర్‌బిఐ బ్యాంకుపై దృష్టిపెట్టడం ప్రారంభించింది. 2018లో రాణా కపూర్ అప్పులు, బ్యాలెన్స్ షీట్లలో తప్పు చేశారని ఆర్‌బిఐ ఆరోపించింది. అలాగే చైర్మన్ పదవి నుంచి తొలగాలని ఆదేశించింది. యస్ బ్యాంక్ షేర్లను నేను ఎప్పుడూ అమ్మనని రాణా ట్వీట్ చేశారు. కానీ 2019 అక్టోబర్‌లో ఆయన తన గ్రూప్ వాటాను 4.72 శాతానికి తగ్గించుకున్నారు.

ప్రైవేటు రంగ యస్ బ్యాంక్ చాలా కాలంగా పెరుగుతున్న అప్పులతో సమస్యల్లో ఉంది. బ్యాంకింగ్ నిబంధనలను పాటించటానికి బ్యాంకుకు రెండు బిలియన్ డాలర్లు అవసరం, అయితే గత రెండేళ్లలో పలువురు పెట్టుబడిదారులతో చర్చలు జరిపినప్పటికీ ఈ మొత్తాన్ని సమీకరించడంలో విఫలమైంది. ఆరు నెలల క్రితం పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత పిఎంసి బ్యాంక్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి చర్య తీసుకుంది.

Yes Bank founder Rana Kapoor arrested by ED,Enforcement Directorate on Sunday arrested Rana Kapoor in connection with the DHFL money laundering case

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News