Sunday, May 12, 2024

పబ్బుకు వచ్చిన యువతిని కోరిక తీర్చాలంటూ..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పబ్బుకు వచ్చిన ఓ యువతిని వేధించిన కామాంధులను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలోని హైఫైవ్ పబ్బుకు వచ్చిన యువతిని కోరిక తీర్చాలంటూ రెండు బైక్‌లతో కామాందులు వెంబడించారు. యువతి బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆమెను కాపాడేందుకు వచ్చిన బాయ్ ఫ్రెండ్‌తో కామాంధులు గొడవకు దిగారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు యువకులను నిలదీయడంతో యువతిని విడిచి పెట్టి పరారయ్యారు. మరోవైపు హైఫైవ్ పబ్బును శనివారం అర్ధరాత్రి సమయం దాటినా కూడా మూసివేయకపోవడంతో పోలీసులు మూసివేయించేందుకు అక్కడికి వెళ్లగా.. మందుబాబులు పోలీసులపై దాడి చేసేందుకు యత్నించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన తాగుబోతులను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

young girl Sexual Harassed in highfy pub, Begumpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News