Tuesday, April 30, 2024

ప్రియుడు ఇల్లు.. 7వ అంతస్థు నుంచి నగ్నంగా కిందపడిన యువతి

- Advertisement -
- Advertisement -

Husband suicide with lover elope
ఢిల్లీ: యువతి ఏడోవ అంతస్థు నుంచి నగ్నంగా కిందపడిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతి పానీపత్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తుంది. గ్రేటర్ నోయిడాలోని ఓ కెమికల్ ఇంజినీర్ నితిన్ గుప్తాతో పరిచయం ఏర్పడింది. పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. పలుమార్లు నితిన్ గుప్తా నివాసంలో కలుసుకునేవారు. డిసెంబర్ 12న నితిన్ నివాసం ఉంటున్న ఏడో ఫ్లోర్ నుంచి సదరు యువతి నగ్నంగా కిందపడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నితిన్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. తన భార్య కరోనా వైరస్‌తో చనిపోవడంతో సదరు యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నానని తెలిపాడు. డిసెంబర్ 12న తన ఇంటికి వచ్చిందని, ఇద్దరు కలిసి భోజనం చేసిన తరువాత పడుకున్నామని, మర్నాడు ఉదయం స్నానం చేయడానికి బాత్రూమ్‌లో వెళ్లిందని తెలిపాడు. తాను లేచి చూసేసరికి ఆమె కిందపడి ఉందని తెలిపాడు. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News