Monday, May 6, 2024

షర్మిల హౌస్ అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బంధు అక్రమాలపై నిరసనకు బయలుదేరిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలను శుక్రవారం ఉదయం ఆమె ఇంటి వద్దే పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఆమె పోలీసులకు హారతి పట్టి ఇంటి ముందే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా లోటస్‌పాండ్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిరసన దీక్ష సాయంత్రం వరకు కొనసాగించారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి వచ్చిన కొందరు దళితులు షర్మిలకు నిమ్మరసం ఇచ్చి నిరసన దీక్షను విరమింపచేశారు. ఈ సందర్బంగా షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత బంధు పై ప్రజలు తను ఒక లేఖ రాసినట్టు తెలిపారు.లేఖలో వాళ్ల తరఫున పోరాడాలని ఒక వినతి పత్రం పంపించారని తెలిపారు. దళితులకు ఆక్కడ దళిత బంధు పథకం సరిగ్గా అమలు కావడం లేదు

కాబట్టి తాను అక్కడకు వెళ్లి ప్రజల సమస్య తెలుసుకోవాలని బయలు దేరబోతుండగా మమ్మల్ని పోలీసులతో హౌజ్ అరెస్ట్ చేయించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. రెండు సార్లు ఓట్లు వేసిన ప్రజలు దళిత బంధు రావడంలేదని అంటుంటే వాళ్లకు అందుబాటులో ఉండాల్సిన అసరం ఉందన్నారు.సిఎం కేసిఆర్ గజ్వేల్ కు వెళ్లాలి , అక్కడ దళిత బంధు సరిగ్గా అమలు అయ్యేలా చూడాలి అని విజ్ణప్తి చేశారు.అక్కడి ప్రజలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నారని వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలన్నారు. ఆ గ్రామ ప్రజలు మా కోసం కొట్లాడండి అమ్మా అని అడిగితే తాను అక్కడికి వెళ్లాలి అనుకుంటే మమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేశారని ఆందోళన వెలిబుచ్చారు.దళితబంధు పథకంలో అవినీతి జరుగుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉందని , అవినీతికి పాల్పడ్డ వారిపైన సిఎం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికీ దళిత బంధు అమలు చేయాలని షిర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News