Saturday, April 27, 2024

ఎపి సిఎం జగన్‌కు ఇసి ఝలక్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇటీవల వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చెల్లదని ఇసి తేల్చి చెప్పింది.ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు గానీ, శాశ్వత పదవులు గానీ వర్తించవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి పంపినట్టు ఇసి ఓ ప్రకటనలో వెల్లడించింది.

వైఎస్‌ఆర్‌సిపి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైనట్టుగా వచ్చిన వార్తలు, మీడియాలో చూసిన కథనాల ఆధారంగా ఇసి స్పందించింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలి. శాశ్వత అధ్యక్షుడు, శాశ్వత పదవులు ప్రజాస్వామ్య వ్యతిరేకం. అనేకసార్లు లేఖలు రాసినా….సమాచారం కోరినా స్పందించలేదు కాబట్టి జగన్ వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు మీడియాలో వచ్చిన వార్తలను నిజమని భావిస్తున్నాం… వైకాపా స్పందించకపోవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చాం. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమైన వ్యవహారం. ఇలాంటివి చెల్లుబాటు కాదు… వెంటనే అంతర్గత విచారణ జరిపి ఆ నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News