Saturday, April 27, 2024

ఇంటివాడు కాబోతున్న చాహల్..

- Advertisement -
- Advertisement -

Yuzvendra Chahal Egaged with Dhanasree Varma

న్యూఢిల్లీ: భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే తన ప్రియురాలు, కొరియో గ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడబోతున్నాడు. గత కొంత కాలంగా ధనశ్రీతో చాహల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని చాహల్ ధ్రువీకరించాడు. ధనశ్రీని పెళ్లాడబోతున్న విషయాన్ని చాహల్ స్వయంగా వెల్లడించాడు. కొంత కాలంగా చాహల్, ధనశ్రీ ప్రేమీంచుకుంటున్నారు. మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు తరచుగా వచ్చేవి. అయితే అప్పట్లో చాహల్ దీన్ని ఖండించేవాడు. అయితే తాజా ప్రకటనతో ఆ వార్తలు నిజమనే విషయం స్పష్టమైంది. ఇదిలావుండగా వీరి వివాహానికి ఇరు కుటుంబాలు పెద్దలు అంగీకరించారు. దీంతో త్వరలోనే ధనశ్రీ, చాహల్ వివాహ బంధంతో ఒకటి కానున్నారు. కాగా, శనివారం రోకా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇందులో ఇరు కుటుంబాలకు చెందిన వారు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చాహల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

Yuzvendra Chahal Egaged with Dhanasree Varma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News