Monday, April 29, 2024

పసిడి పల్లీ..

- Advertisement -
- Advertisement -

వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగకు గురువారం రి కార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా క్వింటాలకు రూ. 9,419 దక్కింది. చిన్నంబావి మండల పరిధిలోని కాలూ రు గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ మార్కెట్‌కు తీసుకొచ్చిన వేరుశనగకు ఈ ధర లభించింది. వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, రైతు రామకృష్ణను అభినందించారు. ఈ సందర్భంగా ర మేష్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో మంత్రి నిరంజన్‌రెడ్డి తెచ్చిన సాగునీటితో వనపర్తి వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందన్నారు.

ఉ మ్మడి పాలమూరు జిల్లా వేరుశనగ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షిస్తున్నదన్నారు. దాదాపు లక్ష ఎ కరాల్లో వేరుశనగ సాగవుతుందన్నారు. పాలమూరు వ్య వసాయం రూపురేఖలు మార్చిన సిఎం, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ పరంజ్యో తి, మార్కెట్ అధికారి స్వరణ్ సింగ్, కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News