Monday, April 29, 2024

‘మోల్నుపిరవిర్’ తయారీకి 105 వర్ధమాన దేశాలను అనుమతి!

- Advertisement -
- Advertisement -

105 countries allowed to manufacture molnupiravir

వాషింగ్టన్ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న వేళ దీన్ని అరికట్టడానికి త్వరలో అందుబాటులోకి రానున్నతమ పిల్‌ను 105 అభివృద్ధి చెందిన దేశాల్లో చౌక గా ఉత్పత్తి చేసి విక్రయించడానికి అనుమతిస్తామని ఈ పిల్‌ను అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన ఔషధ తయారీ దిగ్గజం మెర్క్ శుక్రవారం ప్రకటించింది. కొవిడ్ 19 చికి త్స కోసం ఈ సంస్థ మోల్నుపిరవిర్ పేరుతో ఒక పిల్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసింది. కొవిడ్ చికిత్సకోసం అభివృద్ధి చేస్తున్న మొట్టమొదటి పిల్ అయిన ఇది విస్తృత స్థా యి క్లినికల్ ట్రయల్స్‌లో హైరిస్క్ పేషెంట్లలో ఆస్పత్రిలో చేరే ప్రమాదం, మరణాలను సగానికి తగ్గించగలిగినట్లు ఈ నెల ప్రారంభంలో ఈ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత అమెరికా లాంటి సంపన్న దేశాలు పెద్ద ఎత్తున ఈ పిల్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకుంటే పేద దేశాలకు వ్యా క్సిన్ తరహాలోనే ఈ పిల్‌కు కూడా దూరమవుతాయేమోననే భయాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఈ డ్రగ్ తయారీ లైసెన్స్‌ను ఉచితంగా అందజేస్తామని మెర్క్ ప్రకటించడం మంచి పౌర సంబంధాల కోసమేనని విశ్లేషకులు అ భిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో చికిత్సకు అందుబాటులో ఉండేందు కు వీలుగా మెర్క్ సంస్థ ఐక్య రాజ్య సమితి మద్దతున్న సంస్థ మెడిసిన్స్ పేటెంట్ పూల్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా లాంటి సంపన్న దేవాలకు ఈ సంస్థ మోల్నుపిరవిర్‌ను అధిక ధరకు సరఫరా చే సుంతన్నప్పటికీ దీని జనరిక్ వెర్షన్ తయారీకి 8 డాలర్లకు మించి ఎక్కువ కాదని కొంత మం ది నిపుణులు అంటున్నారు. ఇప్పటికే అభివృ ద్ధి చెందుతున్న దేశాలకు చెందిన 50కి పైగా కంపెనీలు ఈ డ్రగ్‌ను ఉత్పత్తిచేయడం కోసం మెడిసిన్స్ పేటెంట్ పూల్‌ను సంప్రదించాయి కూడా. అయితే ఇప్పటివకు మోల్నుపిరవిర్‌కు ఏ రెగ్యులేటరీ ఏజన్సీనుంచి కూడా అనుమతి రాకపోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News