Sunday, May 5, 2024

రాష్ట్రంలో కొత్త కేసులు 11

- Advertisement -
- Advertisement -

Coron Cases

 

20 మంది డిశ్చార్జ్
1107కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య
22 జిల్లాల్లో 14 రోజులుగా నమోదు కాని కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. బుధవారం నమోదైన కేసులన్నీ జిహెచ్‌ఎంసి పరిధికి చెందినవే. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1107కి చేరగా, వైరస్ బారిన పడి పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతులుగా 648 మంది ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 430 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌కు చెందిన 10 మంది, సూర్యాపేట్ 2, వికారాబాద్ 1, ఖమ్మం 1, ఆదిలాబాద్ 2, మేడ్చల్ 1, నిర్మల్ 1, గద్వాల్ నుంచి ఇద్దరు బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యాధికారులు బులిటెన్‌లో ప్రకటించారు.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుంది
తెలంగాణ వ్యాప్తంగా 22 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడం శుభపరిణామమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట్, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట్, నారాయణపేట్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా, గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్ అన్ని సౌకర్యాలతో సిద్ధమైందని అధికారులు ప్రకటించారు.

11 Coron Cases Registered in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News