Saturday, April 27, 2024

కరెంట్ షాక్ తో 17 బర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

current shock

 

ములుగు: విద్యుత్ షాక్‌తో 17 బర్రెలు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని కాసిందిపేట గ్రామంలో చోటుచేసుకుంది. 11 కెవి వైరు పొలంలో పడడంతో అవి బర్రెలకు తాకడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాయి. పశువల కాపారి 17 బర్రెలను తన వ్యవసాయం క్షేత్రంలోనికి తీసుకెళ్లాడు. 11 కెవి వైరు తెడిపడి ఉండడం పశువుల కాపారి గమనించకపోవడంతో బర్రెలు వైరు దగ్గరికి వెళ్లి మృత్యువాతపడ్డాయి. దీంతో గ్రామంలో పశువుల కాపారి విషాదంలో మునిగిపోయాడు. సుమారు రూ.15 లక్షల నష్టం వాటినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం మూడు బర్రెలు గాయపడడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పశువుల కాపారికి నష్ట పరిహారం ఇప్పిస్తామని విద్యుత్ అధికారులు హామీ ఇచ్చారు. విద్యుత్ అధికారుల నిర్లక్షంతో ఈ ప్రమాదం జరిగినట్టు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా శిథిలావస్థకు చేరుకున్న కరెంట్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. పాతబడిన వైర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News