Monday, May 6, 2024

కరోనాతో కానిస్టేబుల్ మృతి…. ఇండియా@26,465

- Advertisement -
- Advertisement -

CORONA

 

ముంబయి: కరోనా సోకి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది. సందీప్ సర్వే అనే కానిస్టేబుల్ (52) కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయాడు. కరోనాతో రెండో పోలీస్ చనిపోవడంతో ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉలిక్కిపడుతోంది. శనివారం రాత్రి పది గంటలో ప్రాంతంలో కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ వకోలా పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ చంద్రకాంత్ గణపతి పెండూర్కర్ (57) మృతి చెందాడు. దీంతో పోలీస్ డిపార్ట్ మృతుల పట్ల సంతాపం తెలపడంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. మహారాష్ట్రలో 96  మంది కానిస్టేబుళ్లు, 15 మంది పోలీసు ఉన్నతాధికారులకు కరోనా సోకినట్టు సమాచారం.  మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ముంబయి మహానగరం కరోనాతో విలవిలలాడుతోంది. చాపకింద నీరులా ముంబయి నగరమంతా కరోనా వ్యాపిస్తోంది. ఒక్క ముంబయి మహానగరంలో కరోనా రోగుల సంఖ్య 5049కి చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ 7629 మందికి సోకగా 323 మంది మృతి చెందారు. భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా రోగులు సంఖ్య 26,465 చేరుకోగా 826 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో కరోనా వైరస్ 990 మందికి సోకగా 25 మంది మరణించారు. ఎపిలో కరోనా బాధితుల సంఖ్య 1097కు చేరుకోగా 31 మంది బలయ్యారు. ప్రపంచంలో కరోనా వైరస్ 29.22 లక్షల మంది సోకగా రెండు లక్షల మూడు వేల మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్క అమెరికాలో కరోనాతో 9.60 లక్షల మంది బాధపడుతున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో 54,265 మంది చనిపోయారు.

రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు:

రాష్ట్రాలు& కేంద్రపాలిత ప్రాంతాలు బాధితులు సంఖ్య కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
7,628 1,076 323
గుజరాత్ 3,071 282 133
ఢిల్లీ
2,625 869 54
రాజస్థాన్ 2,141 513 35
మధ్య ప్రదేశ్
1,945 281 99
తమిళనాడు
1,821 960 23
ఉత్తర ప్రదేశ్
1,793 261 27
ఆంధ్రప్రదేశ్
1,097 231 31
తెలంగాణ
990 307 25
పశ్చిమ బెంగాల్
611 105 18
కర్నాటక
500 158 18
జమ్ము కశ్మీర్ 494 112 6
కేరళ 458 338 4
పంజాబ్ 308 72 17
హర్యానా
287 191 3
బిహార్ 251 45 2
ఒడిశా 103 34 1
ఝార్ఖండ్
67 8 3
ఉత్తరాఖండ్
48 26
హిమాచల్ ప్రదేశ్
40 22 2
ఛత్తీస్ గఢ్ 37 32
అస్సాం 36 19 1
అండమాన్ నికోబార్ దీవులు
33 11
ఛండీగఢ్
28 15
లడఖ్
20 16
మేఘాలయ
12 1
పుదుచ్చేరీ
8 4
గోవా 7 7
మణిపూర్
2 2
త్రిపుర
2 2
అరుణాచల్ ప్రదేశ్ 1 1
మిజోరం 1
మొత్తం 26,465 6,000 826
దేశాల వారిగా కరోనా బాధితుల వివరాలు
Head Constable Dead with coronavirus in Maharashtra
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News