Friday, April 26, 2024

24 గంటల్లో 21వేల టెస్టులు

- Advertisement -
- Advertisement -

ఒక్క రోజు 21,380 టెస్టులు
కొత్తగా 1986 పాజిటివ్‌లు, 14 మంది మృతి
జిహెచ్‌ఎంసిలో 586, జిల్లాల్లో 1400 మందికి వైరస్
62,703 కు పెరిగిన కరోనా బాధితులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో టెస్టుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గురువారం ఒక్క రోజు ఏకంగా 21,380 మందికి టెస్టులు చేయగా, 1986 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో జిహెచ్‌ఎంసిలో 586 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో16, భద్రాది 29,జగిత్యాల 7, జనగాం 21, భూపాలపల్లి 4,గద్వాల 32, కామారెడ్డి 46,కరీంనగర్ 116,ఖమ్మం 41, ఆసిఫాబాద్ 2, మహబూబ్‌నగర్ 61 , మహబూబాబాద్ 37, మంచిర్యాల 35, మెదక్ 45, మేడ్చల్ మల్కాజ్‌గిరి 207, ములుగు 27, నాగర్‌కర్నూల్ 30, నల్గొండ 36,నారాయణపేట్ 4, నిజామాబాద్ 19, పెద్దపల్లి 26,సిరిసిల్లా 23, రంగారెడ్డి 205, సంగారెడ్డి 108, సిద్ధిపేట్ 20, సూర్యాపేట్ 6, వికారాబాద్ 5,వనపర్తి 18, వరంగల్ రూరల్ 30, వరంగల్ అర్బన్ లో 123, యాదాద్రిలో మరో 12 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 62,703కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 45,388కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 16,796 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 10,632 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 519కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్‌టిసిపిఆర్, 320 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు మరో 23 ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ పరీక్షలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ హాస్పిటల్స్ బెడ్ల వివరాలు(30.7.2020):
బెడ్లు          అందుబాటులో ఉన్నవి   నిండినవి   ఖాళీలు
సాధారణ             2532           749      1783
ఆక్సిజన్             4663           1269      3394
వెంటిలేటర్           1251            264       987
మొత్తం              8446            2282      6164
ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్ల వివరాలు(30.7.2020):
బెడ్లు         అందుబాటులో ఉన్నవి   నిండినవి    ఖాళీలు
సాధారణ            2974            1668      1306
ఆక్సిజన్            2269            1443       826
వెంటిలేటర్          1166            771        395
మొత్తం             6409             3882      2527

1986 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News