Saturday, April 27, 2024

తెలంగాణలో మరో 2511 కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana Covid 19 Cases Cross One Lakh Mark

 

జిహెచ్‌ఎంసిలో 305,జిల్లాల్లో 2206 కేసులు
వైరస్ దాడిలో మరో 11 మంది మృతి
1,38,395కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 2511 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసిలో 305 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 23, భద్రాద్రి 93,జగిత్యాల 85, జనగాం 38, భూపాలపల్లి 12, గద్వాల 27, కామారెడ్డి 60, కరీంనగర్ 150,ఖమ్మం 142, ఆసిఫాబాద్ 23,మహబూబ్‌నగర్ 42 , మహబూబాబాద్ 58, మంచిర్యాల 73, మెదక్ 42, మేడ్చల్ మల్కాజ్‌గిరి 134, ములుగు 18, నాగర్‌కర్నూల్ 40, నల్గొండ 170,నారాయణపేట్ 16, నిజామాబాద్ 93, పెద్దపల్లి 65,సిరిసిల్లా 72, రంగారెడ్డి 184, సంగారెడ్డి 70, సిద్ధిపేట్ 80, సూర్యాపేట్ 70, వికారాబాద్ 19,వనపర్తి 40, వరంగల్ రూరల్ 36, వరంగల్ అర్బన్ లో 96, యాదాద్రిలో మరో 78 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో 11 మంది చనిపోయారు.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,38,395కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య1,04,603 కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పరA్యవేక్షణలో 32,915 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 25,729మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 877కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 33 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా, 1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

మంత్రి హరీష్‌రావుకు కోవిడ్ పాజిటివ్
మంత్రి హరీష్‌రావుకు కోవిడ్ పాజిటివ్ తేలింది. తనలో స్పల్ప కరోనా లక్షణాలు తేలడంతో టెస్టు చేపించుకోగా వైరస్ నిర్ధారణ అయినట్లు ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు. లక్షణాలు ఉన్న వారు వెంటనే టెస్టు చేపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రతి పది లక్షల్లో 44వేల మందికి పరీక్షలు…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పది లక్షల మందిలో 44,918 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం చేసిన 61,132 టెస్టులు కలిపి ఇప్పటి వరకు 16,67,653 మందికి టెస్టులు చేశామని వైద్యాధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పాజిటివ్ తేలిన వారిలో 95,493 మందికి లక్షణాలు లేకుండా వైరస్ సోకితే, మరో 42,902 మందికి లక్షణాలతో కోవిడ్ తేలినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 5322, ప్రైవేట్‌లో 5797 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు వైద్యశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News