Thursday, May 9, 2024

26 మందుల ఎగుమతిపై కేంద్రం నిషేధం

- Advertisement -
- Advertisement -

drugs

 

నిషేధిత మందుల జాబితాలో పారాసిటమాల్ తదితరాలు

న్యూఢిల్లీ: ప్రపంచానికి జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో ప్రధాన దేశమైన భారత్ 26 ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాలతో తయారయ్యే మందుల ఎగుమతిని నిషేధించింది. ఈ మందుల్లో పారాసిటమాల్ లాంటివి ఉన్నాయి. కరోనా వైరస్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో మందుల కొరత ఏర్పడకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా వీటి ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది. భారతీయ ఔషధ పరిశ్రమలు తాము తయారు చేసే మందులకు అవసరమైన ముడి పదార్థాల్లో దాదాపు 70 శాతం చైనానుంచే దిగుమతి చేసుకుంటాయి.

అయితే ఆ దేశంలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా అక్కడినుంచి సరఫరాలు తగ్గిపోయాయి. కరోనా వైరస్ తీవ్రత మరికొంతకాలం ఇలాగే కొనసాగితే సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ ప్రధాన ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాలు(ఎపిఐ)లనుంచి తయారయ్యే ఔషధాల ఎగుమతులను తక్షణం నిలిపి వేయడమైనది’ అని విదేశీ వ్యాపార డైరెక్టర్ జనరల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

యితే ఈ ఆంక్షలు ఎంతమేరకు ఉంటాయో ఆ ప్రకటనలో తెలియజేయలేదు. కాగా ప్రభుత్వం నిషేధించిన మందుల జాబితాలో 26 ఎపిఐలు, ఫార్ములేషనుల ఉన్నాయి. భారత్‌నుంచి ఎగుమతి అయ్యే మొత్తం మందుల్లో 10 శాతం ఇవే ఉన్నాయి. అయితే ఎగుమతులపై నిషేధంతో సంబంధం లేకుండా రాబోయే రెండు నెలల్లో ఈ ముడి పదార్థాల్లో కొన్ని కొరతలను ఎదుర్కొనే అవకాశం ఉందని ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మెక్సిల్) చైర్మన్ దినేశ్ దువా అన్నారు. ఒక వేళ కరోనా వైరస్‌ను అదును చేయని పక్షంలో ఈ కొరతలు చాలా తీవ్రంగా ఉంటాయని దువా చెప్పారు. ఈ మండలి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది.

26 Center ban on export of drugs
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News