Saturday, April 27, 2024

ఇండోనేషియాలో వరదలకు 26 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇండోనేషియాకు చెందిన సుమత్రా ద్వీపంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొడచరియలు విరిగిపడిన ఘటనలలో 26 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మరో 11 మంది ఆచూకీ తెలియరావడం లేదని వారు చెప్పారు. రుతు పవనాల ప్రభావంతో పశ్చిమ సుమత్రా ప్రావిన్సులోని 9 జిల్లాలు, నగరాలలో గత గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నది ఒడ్డున గట్లకు గండ్లు పడడంతో అనేక పర్వత ప్రాంతాలలోకొండ చరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు వంతెనలు కూలిపోవడం, బురద, శిథిలాలతో రోడ్లు నిందిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

రెసిసిర్ సెలటాన్ జిల్లాతోపాటు సొరుగున ఉన్న పడాంగ్ పరియమన్ జిల్లాలో కొన్ని మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీసినట్లు సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు. దీంతో మృతులు సంఖ్య 26కి పెరిగినట్లు ఆయన చెప్పారు. కొండ చరియలు విరిగిపడడంతో కనీసం 14 ఇళ్లు ధ్వంసమయ్యాయని, శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇద్దరు గ్రామస్తులను సిబ్బంది రక్షించారని, మరో 11 మంది కోసం గాలిస్తున్నారని ఆయన చెప్పారు. భారీ వర్షాల కారణంగా 37,000 ఙళ్లు, భవనాలు నీట మునిగిపోయాయని, మూడు ఇళ్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News