Monday, April 29, 2024

ఇంతకు ముందు దేశంలో 28 సార్లు అవిశ్వాస తీర్మానాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ సారధ్యపు కేంద్ర ప్రభుత్వంపై ఇప్పుడు వెలువడ్డ అవిశ్వాస తీర్మానం రెండోది. కాగా స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటివరకూ వివిధ ప్రభుత్వాలపై 28 సార్లు అవిశ్వాస అస్త్రం ప్రయోగించారు. కాగా అవిశ్వాస ఓటు, బలపరీక్ష దశలో 1979లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ విధంగా అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వం పతనం చెందిన ఘటన ఈ ఒక్కటిగానే మిగిలింది. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు రెండు సార్లు అవిశ్వాసం ఎదుర్కొవల్సి వచ్చింది. తృటిలో ప్రభుత్వ పతనం ముప్పు తప్పింది.

అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల అవిశ్వాసం ప్రకటించేందుకు వీలు కల్పిస్తూ 1952లో లోక్‌సభ నిబంధనలలో మార్పు చేశారు. అయితే ఇందుకు ముందు కనీసం 30 మంది సభ్యులు తీర్మాన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని రూల్ పెట్టారు. ఇప్పుడు సభలో సభ్యుల సంఖ్య పెరగడంతో దీనిని 50గా ఖరారు చేశారు. తొలి రెండు లోక్‌సభల హయాంలలో ఓ ఒక్క అవిశ్వాస తీర్మానం రాలేదు.

నెహ్రూ ప్రభుత్వంపై 1963లో అవిశ్వాసం
మూడో లోక్‌సభ దశలో 1963లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఆచార్య జెబి కృపలానీ అవిశ్వాసం ప్రతిపాదించారు. దీనిపై చర్చ నాలుగురోజులకు పైగా మొత్తం 21 గంటల పాటు చర్చ జరిగింది. ఇందులో 40 మంది సభ్యులు పాల్గొన్నారు. దీనికి నెహ్రూ జవాబిచ్చారు. నిజానికి అవిశ్వాసం వల్ల ఉద్ధేశించిన ప్రభుత్వ పతనం ఏదీ జరగదు. అయితే దీని పట్ల తనకూ అత్యంత ఆసక్తి కల్గిందని, ఓ విధంగా రాజకీయ ప్రయోజనానికి దారితీసింది. తీర్మానాన్ని తాను వ్యక్తిగతంగా ఆహ్వానించానని, చర్చకు సిద్ధపడ్డానని తెలిపారు. అధికారంలో ఉన్న వారికి తరచూ కాకపోయినా అప్పుడప్పుడు ఇటువంటి చురకల వంటి పరీక్షలు అవసరం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News