Monday, April 29, 2024

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి: డిహెచ్

- Advertisement -
- Advertisement -

3614 new covid-19 cases reported in telangana

 

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 3,614 మందికి కరోనా సోకగా, మరో 18 మరణాలు సంభవించాయని శ్రీనివాసరావు తెలిపారు. అదే సమయంలో 3,961 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. కరోనా రికవరీ రేటు 93శాతం ఉందన్నారు. కరోనా మరణాల రేటు 0.5 శాతంగా ఉందని ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. జ్వర సర్వేలో 17 వేలకు పైగా బృందాలు పాల్గొన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య బృందాలు 6 లక్షల ఇళ్లలో జ్వర సర్వే చేశాయన్నారు. కోవిడ్-19 ఓపిలో 11,814 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని డిహెచ్ వెల్లడించారు. అటు తెలంగాణలో 64 ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని శ్రీనివాసరావు చెప్పారు. ఆస్పత్రులపై ఫిర్యాదులకు 9154170960 నంబరుకు వాట్సాప్ చేయొచ్చని ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News