Friday, May 3, 2024

24 గంటల్లో 15,968 మందికి సోకిన కరోనా

- Advertisement -
- Advertisement -

465 deaths and 15968 new COVID 19 cases in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 465 మరణాలు, అత్యధికంగా 15,968 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4లక్షల 56వేల 183కి చేరింది. అందులో ప్రస్తుతం 1,83,022 యాక్టివ్ కేసులుండగా.. 2,58,685 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 14,476 మరణాలు సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇటు తెలుగురాష్ట్రాల్లో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,553 మందికి కరోనా సోకగా… 220 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎపిలో 9,834 మందికి కరోనా బారిన పడగా… 119 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షా 39,010 కేసులు నమోదు కాగా… 6,531మందిని కరోనా ఖతం చేసింది. తమిళనాడులో 833 మంది కోవిడ్ తో మృతి చెందగా… 64,603మందికి వైరస సోకింది. దేశరాజధాని ఢిల్లీలో 66,602 కరోనా పాజిటివ్ కేసులు రికార్డు కాగా… 2,301 మరణాలు సంభవించాయి. గుజరాత్ లో కరోనా కేసులు 30వేలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 1,710మంది ప్రాణాలు విడిచారు. కర్నాటకలో కోవిడ్ కేసులు 10వేలకు దగ్గరలో ఉన్నాయి. 150 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ వేగంగా జరుగుతుంది.

465 deaths and 15968 new COVID 19 cases in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News