Monday, April 29, 2024

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

5 year old girl sexually assaulted in Baran district

బరన్‌: పాఠశాల పరిసరాల్లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన అమానుష ఘటన రాజస్థాన్‌లోని బరన్ జిల్లా షహాబాద్ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికపై మహావీర్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని స్టేషన్ ఇన్‌చార్జి హరిప్రసాద్‌ రాణా తెలిపారు.

5 year old girl sexually assaulted in Baran district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News