Friday, April 26, 2024

దేశంలో కరోనా రికార్డు మరణాలు

- Advertisement -
- Advertisement -

52050 New Covid 19 cases and 803 deaths in India

 

ఒక్క రోజే 803 మంది వైరస్‌కు బలి
39 వేలకు చేరువలో మొత్తం మరణాలు
కొత్తగా మరో 52 వేల మందికి పాజిటివ్
12 లక్షలు దాటిన రికవవరీలు
ఒక్క రోజే 44 వేల మంది డిశ్చార్జి
66.31 శాతానికి పెరిగిన రికవరీ రేటు
2.1 శాతానికి తగ్గిన మరణాల రేటు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొవిడ్ మరణాలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 803 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 38,938కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా మరో 52,050 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 18,55,745కు చేరుకుంది. వీరిలో 12 లక్షల మందికి పైగా కోలుకుని ఇళ్లకు చేరుకోగా, 5,86,298 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్క రోజే 44 వేల మందికి పైగా కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రికవరీ రేటు 66.31 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 2.1 శాతానికి తగ్గింది. రోజూ 50 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరసగా ఇది ఆరో రోజు. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,08,64,750 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని, సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో6,61,892 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి( ఐసిఎంఆర్) శాస్త్రవేత్త డాక్టర్ లోకేశ్ శర్మ చెప్పారు. గూలై నెలలో పగటున రోజుకు 3,39,744 పరీక్షలు నిర్వహించారని కూడా ఆయన చెప్పారు. ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రతకొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రతి రోజూ 250కి పైగా కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 15,842 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు, ఢిల్లీలో ఇప్పటివరకు 4,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కర్నాటక, గుజరాత్‌లో కూడా 2500కు పైగా మరణాలు సంభవించాయి.

అమెరికా, బ్రెజిల్‌ను దాటిన భారత్
కాగా రోజువారీ కేసులను చూస్తే భారత్, అమెరికా, బ్రెజిల్‌లను దాటేసింది. రోజువారీ కేసులు అత్యధికంగా భారత్‌లోనే నమోదవుతున్నాయి. సోమవారం ఒక్క రోజే భారత్‌లో దాదాపు 53 వేల కేసులు నమోదు కాగా, అమెరికాలో49వేలు, బ్రెజిల్‌లో 29 వేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో రెండు రోజుల క్రితం వరకు రోజూ 60 వేల కేసులు నమోదవుతూ ఉండేవి. అయితే గత రెండు రోజులుగా అక్కడ కేసుల సంఖ్య తగ్గింది. కాగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండగా, మరణాల విషయంలో ఐదో స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 47 లోల మంది వైరస్ బారిన పడగా వీరిలో లక్షా 55 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా బ్రెజిల్‌లో 27 లక్షల మందికి వైరస్ సోకగా దాదాపు 95 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

హోం ఐసొలేషన్‌లో త్రిపుర సిఎం
త్రిపుర ముఖ్యమంత్రి నివాసంలో కరోనా కలకలం రేపింది. ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్ కుటుంబంలో ఇద్దరు సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. తనకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారని, ఇంకా ఫలితాలు రాలేదని సిఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హోమ్ ఐసొలేఫన్‌లో ఉండనున్నట్లు ఆయన ఓ ట్వీట్‌లో తెలిపారు.

52050 New Covid 19 cases and 803 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News