Monday, April 29, 2024

కొత్తగా మరో 623 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

623 new covid-19 cases reported in telangana

 

జిహెచ్‌ఎంసిలో 77,జిల్లాల్లో 546 కేసులు
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
6,47,229కి చేరిన బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 623 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసిలో 77 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 6, భద్రాద్రి 22,జగిత్యాల 22, జనగామ 13, భూపాలపల్లి 3, గద్వాల 5, కామారెడ్డి 1, కరీంనగర్ 65,ఖమ్మం 52, ఆసిఫాబాద్ 2,మహబూబ్‌నగర్ 4, మహబూబాబాద్ 9, మంచిర్యాల 19, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్‌గిరి 33, ములుగు 6, నాగర్‌కర్నూల్ 5, నల్గొండ 41, నిజామాబాద్ 6, పెద్దపల్లి 41,సిరిసిల్లా 20, రంగారెడ్డి 25, సంగారెడ్డి 8, సిద్ధిపేట్ 13, సూర్యాపేట్ 24, వికారాబాద్ 2,వనపర్తి 5, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ లో 59, యాదాద్రిలో మరో 18 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,47,229కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 6,34.612కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 8803 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 97 శాతం మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వందలో 98 మంది కోలుకుంటున్నారు…

వైరస్ బారిన ప్రతి వంద మందిలో 98 మంది సులువుగా కోలుకుంటున్నారని ఆరోగ్యశాఖ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ప్రతి పది లక్షల్లో 6,02,341 మందికి పరీక్షలు…

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పది లక్షల్లో 6,02,341 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో బుధవారం చేసిన 1,12,796 టెస్టులు కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,24,19,167 మందికి టెస్టులు చేశామని వైద్యాధికారులు వెల్లడించారు. పాజిటివ్ తేలిన వారిలో 97 శాతం మందికి లక్షణాలు లేకుండా వైరస్ సోకితే, మరో 3 శాతం మందికి లక్షణాలతో కొవిడ్ తేలినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.అంతేగాక మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర డెత్ రేట్ కూడా అతి తక్కువగా నమోదవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News