Thursday, May 9, 2024

పల్లె మెరసి.. పట్నం విరిసి.. హరితం మురిసి

- Advertisement -
- Advertisement -

ముగిసిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం

10రోజుల పాటు సాగిన కార్యక్రమం
మెరుగైన రోడ్ల పరిశుభ్రత, కాలువల్లో పూడిక తీత, ప్రభుత్వ సంస్థలకు కొత్త వన్నె
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా మట్టితో కప్పడం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను బయోఫెన్సింగ్
ఇంటికి ఆరు మొక్కల వంతున హరితహారం
రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటడం వంటి ప్రగతి పనులు విజయవంతం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 4వ విడత పల్లె, పట్టణ ప్రగతి, 7వ విడత తెలంగాణకు హరితహారం విజయవంతంగా ముగిసింది. ఈ నెల ఒకటవ తేదీ నుంచి మొదలైన ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు జరిగాయి. శనివారం చివరి రోజు కావడంతో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉదయం నుంచే పెద్దఎత్తున పరిశుభ్రత…పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలతో వల్ల గ్రామాలు, పట్టణాల రూపురేఖల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. అవి ప్రస్తుతం సర్వాంగ సుందరంగా మారాయి. పల్లెలు, పట్టణాల్లో ఎక్కడా మట్టికుప్పులు, చెత్తకుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు వాటిని యుద్దప్రాతిపదికన తొలగించారు. రోడ్లపై డ్రైనేజీ నీరు పొంగకుండా తగు చర్యలు తీసుకున్నారు. నాలాలు, కాలువల్లో కూడా పెద్దఎత్తున పూడిక పనులు చేపట్టారు. దీంతో మురుగునీరు నిలవకుండా సాఫీగా వెళ్లిపోతుండడంతో వాటి నుంచి దుర్వాసనలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే నాలాలకు ఇరవైపులా, అవకాశం ప్రతి చోటు మంచి సువాసనలు వెదజల్లే పూలమొక్కలను కూడా నాటారు. అలాగే పలు రహదారులకు ఇరవైపులా కూడా చూడచక్కని మొక్కలను నాటారు. దీంతో రోడ్లకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఇక ఖాళీ స్థలాలు, ఇళ్ల ముందు కూడా పెద్దఎత్తున మొక్కలు నాటిన కారణంగా పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో మెరిసిపోతున్నాయి. నారాయణపేట్‌లో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతిలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రామాల్లో పాల్గొని, పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, భవిష్యత్ తరాల వారికి హరిత తెలంగాణను అందించాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మొక్కలను నాటడంతో తెలంగాణ రాష్ట్రం సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నదన్నారు. ఇక విజన్ ఉన్న సిఎంగా కెసిఆర్ ఉండడం వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాల్సిన అవసముందన్నారు. అలాగే కరీంనగర్‌లో మంత్రి గంగుల కమాలాకర్, వికారాబాద్ తాండూరు మున్సిపాలిటిలో మాజీ మంత్రి, ఎంఎల్‌సి పట్నం మహేందర్‌రెడ్డి, నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్ జిల్లా కరువి మండలంలో మంత్రి సత్యవతి రాథోడ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పది రోజుల కార్యక్రమాలు
* 6,56,295 – గ్రామాల్లో పరిశుభ్రమైన రోడ్లు
* 3,51,363 మురుగు కాలువల పూడికతీత
* 1,58,251 ప్రభుత్వ సంస్థల పరిశుభ్రం
* 50,261 నీటి నిల్వలను మట్టితో పూడ్చిన లోతట్టు ప్రాంతాల సంఖ్య
* 12,720 వైకుంఠ ధామాలకు బయోఫెన్సింగ్
* 12,776 డంపింగ్ యార్డ్‌లకు బయో ఫెన్సింగ్
* 7,83,98,,578 మొక్కల పంపిణీ (ఒక్కొక్క ఇంటికి 6 మొక్కలు చొప్పున)
* 1,61,07,043 మీటర్ల మేర రహదారుల కిరువైపులా మొక్కలు నాటారు.
* 1,22,21,324 ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటారు
* 70,64,719 చని పోయిన స్థానాల్లో నాటిన కొత్త మొక్కల సంఖ్య
* 25,298 కొత్త కరెంటు స్థంభాలు (తుప్పు పట్టిన పాత విద్యుత్ స్తంభాల స్థానంలో )
* 41,652 మూడవ వైరు అమర్చిన విద్యుత్ స్థంభాల సంఖ్య
* 19,503 సమకూర్చిన కొత్త విద్యుత్ మీటర్లు
అన్ని విడతల్లో కలిపి ఇప్పటివరకు
* రూ. 116 కోట్లతో 19,298 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
* రూ. 1555 కోట్లతో12,728 వైకుంటధామాలు
* రూ.318 కోట్లతో 12, 776 డంపింగ్ యార్డుల నిర్మాణం
* రూ.6,500 కోట్ల మేరకు 2019 సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు గ్రామీణ స్థానిక సంస్థలకు మంజూరీ చేసిన  గ్రాంట్లు
* 12,769 గ్రామ పంచాయితీలకు ట్యాంకర్లు, ట్రాలీలతో పనిచేసి చెత్తను తరలించాయి
* 12 వేల 769 గ్రామాలలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వర్కు కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ కమిటీ,  గ్రీన్ కవర్ కమిటీలను ఏర్పాటు చేశారు.

7th phase Haritha Haram programme completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News