Monday, May 6, 2024

భారతీయుల ప్రత్యేక విమానానికి చైనా నిరాకరణ

- Advertisement -
- Advertisement -

China did not allow Air India flights

 

బీజింగ్ : న్యూఢిల్లీ నుంచి భారతీయులతో చైనా లోని గుయాంగ్‌జోయు నగరానికి వచ్చిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానానికి చైనా సోమవారం అనుమతించలేదు. ఈ విమానంలో దౌత్యవేత్తల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ నెల 21న షాంఘైకు వచ్చిన విమానంలో ఇద్దరు భారతీయులకు కరోనా పాజిటివ్ బయటపడడమే దీనికి కారణం. దీంతో భారత్ నుంచి ఖాళీ విమానం గుయాంగ్ జోయి వద్ద దిగడానికి మాత్రమే చైనా అధికార వర్గాలు అనుమతించాయి. అందులో వచ్చిన భారతీయులను తిరిగి వెనక్కు పంపారు.

అయితే భారత్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం వందేభారత్ మూడో దశ కింద 86 మంది భారతీయులతో సోమవారం గుయాంగ్‌జోయి నుంచి బయలు దేరింది. జూన్ 21 న షాంఘై విమానం కూడా భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకెళ్లే మిషన్‌లో భాగమే. ఆ విమానంలో 186 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. దౌత్యవేత్తల పాస్‌పోర్టులతో ప్రత్యేక విమానాలైనప్పటికీ భారతీయులను చైనా అనుమతించక పోడానికి వాణిజ్యపరమైన విమానసర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేకపోవడమే కారణం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News