Thursday, May 9, 2024

పట్టపగలు నడి రోడ్డులో లవర్ పై ప్రియుడు కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పట్టపగలు నడి రోడ్డుపై అమ్మాయిని లవర్ కత్తితో నరుకుతున్న సంఘటన కర్నాటకలోని హుబ్లీ ప్రాంతంలో జరిగింది. ఇస్మాయిల్ (25) అనే కుర్రాడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. జువెల్లరీ షాపులో ఆశ డి అగశారా అనే అమ్మాయి పని చేస్తోంది. ఇద్దరు గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకున్నట్టు సమాచారం. దేశ్‌పాండేనగర్‌లో ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో యువతి  ఆఫీస్ కు వెళ్తుండగా ఇస్మాయిల్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు వేస్తున్న కత్తితో తల, మెడపై కత్తితో దాడి చేశాడు. ఆమె అక్కడనే కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇస్మాయిల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

https://www.youtube.com/watch?v=GenupKKMnIc

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News