Thursday, May 9, 2024

మాస్క్‌లు మరుస్తున్నారు.. జాగ్రత్త!

- Advertisement -
- Advertisement -

People in India are neglecting to wear a mask

ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పక్కకు పడేస్తారేమో: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆందోళన

న్యూఢిల్లీ : ఆంక్షల సడలింపుల నడుమ దేశంలో ప్రజలు మాస్క్‌లు వాడకానికి దూరం అవుతున్నారు. క్రమేపీ ప్రజలలో కరోనా వైరస్ పట్ల ఉదాసీనత పెరుగుతోంది. ఇంతకు ముందటి నిబంధనలను పాటించడం లేదు. ఆగస్టు , సెప్టెంబర్ నాటికి అత్యధిక జనం ఇక మాస్క్‌లు మరిచిపోతారని, వీటిని వేసుకోకుండా తిరుగుతారని వెలువడ్డ అధ్యయన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పందించింది. మాస్క్‌లకు దూరం కావడం ఆందోళనకర పరిణామం అవుతుందని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం ఇక్కడ వారం వారీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ప్రజలలో క్రమేపీ మాస్క్‌ల వాడకం అలవాటు తప్పుతోందని, ఇది మంచి పరిణామం కాదని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో పూర్తిస్థాయిలో సాధారణ జనజీవితం తిరిగి ఆరంభం అయింది.

ఈ క్రమంలో జనం ఇక మాస్క్‌లు ఎందుకు అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర పరిణామం అని అగర్వాల్ తెలిపారు. ఇప్పుడే వైరస్ పూర్తి స్థాయి ఆటకట్టుకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందులో రాజీ పడరాదని తేల్చిచెప్పారు. దేశంలో కొన్ని ప్రాంతాలలో మాస్క్‌ల వాడకం తగ్గుతున్న దాఖలాలు తెలిపే గ్రాఫ్‌ను ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్థారణలోకి తీసుకుంది. మార్చి , ఎప్రిల్ నుంచి దేశంలో మాస్క్‌ల వాడకం పెరిగింది.ఇక సెకండ్ వేవ్ తీవ్రత దశలో మే చివరినాటికి దేశంలో వీటి వాడకం పతాక స్థాయికి చేరింది. అయితే ఇప్పుడు జూన్ , జులై చివరి నాటికి వీటి వాడకం గణనీయంగా తగ్గుతోంది. చివరికి ఆగస్టు ఆ తరువాత సెప్టెంబర్ చివరి నాటికి మాస్క్‌లు మరిచిపోతారేమో లవ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామం ప్రమాదకరం అని కేంద్రం దీని గురించి ఆందోళన చెందుతోందని అగర్వాల్ తెలిపారు. దేశంలో మాస్క్ వాడకపు గ్రాఫ్‌ను ఈ సందర్భంగా విలేకరులకు అందించారు.

గాలి ఆడదు.. ఎందుకీ మాస్క్‌లనే భావన

ప్రజలలో అత్యధికులు బలవంతంగానే మాస్కులు వాడుతున్నారు. ఇది పెట్టుకుంటే ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నామని, ఎందుకొచ్చిన తంటా అని ఎక్కువ మంది వీటికి దూరం అవుతున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ తేల్చుకుంది. గాలి ఆడదు. అసౌకర్యంగా ఉంటుంది. కొవిడ్‌ను మాస్క్‌లు నివా రించేవని, ఇతరులకు బాగా దూరం పాటిస్తూ ఉంటే ఇక మాస్క్‌ల అవసరం ఏముందనే భావన ప్రజలలో ఉందని తేల్చారు. అయితే ఏది ఏమైనా వీటిని వీడవద్దని ఆరోగ్య మంత్రిత్వశాఖ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News