Saturday, May 18, 2024

నిలకడగా గంగూలీ ఆరోగ్యం…

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వుడ్‌లాండ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గంగూలీకి కరోనా సోకడంతో అతను కోల్‌కతాలోని వుడ్‌లాండ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, గంగూలీ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసింది. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతనికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. అతనికి స్వల్ప కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. గంగూలీకి ఎలాంటి జ్వరం లేదని, ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆ బులిటెన్‌లో పేర్కొన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో గంగూలీకి చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Sourav Ganguly to be stable at Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News