Saturday, May 18, 2024

కాన్పుకోసం ఒడిశాకు.. 100 కిలోమీటర్లు నడచిన నిండు గర్భిణి

- Advertisement -
- Advertisement -

pregnant woman

 

మనతెలంగాన/హైదరాబాద్ : తొమ్మిది నెలల నిండు గర్భిణి లాక్‌డౌన్ సమయంలో రవాణా సౌకర్యం లేకపోవడంతో కాన్పుకోసం తన సొంత ఊరు ఒడిశాకు చేరుకునేందుకు కాలినడకన బయలుదేరింది. ఈక్రమంలో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాకు నడిచేందుకు సాహసించింది. ఈక్రమంలో ఖమ్మం జిల్లా కూసుమంచి ఎంఆర్‌ఒ, ఎస్‌ఐలు ఆమెను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రంలో మల్కాన్ గిరి జిల్లా దామన్ పల్లికి చెందిన శ్రీరామ్ శీల్, సునీత దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ దంపతులతో పాటు వారి సమీప బంధువు సుశాంత్ భైరాగ్ కూడా వీరితోనే ఉన్నాడు.

బతుకుదెరువు కోసం వచ్చిన శ్రీరామ్‌శీల్ కుటుంబ పోషణకు కోసం నగరంలో పలు సెంట్రింగ్ పనులకు వెళ్లేవాడు. ఈక్రమంలో మే నెలాఖరున తన భార్య డెలివరీ డేట్ నాటికి తన సొంత ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించడంతో కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు కూలీ పనుల్లేక.. మరోవైపు ఉన్న మొత్తం ఖర్చుకావడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇక హైదరాబాద్ లో ఉంటే బతుకలేమని, ఎలాగైన తన సొంతూరైన ఒడిశాలోని దామన్ పల్లి వెళ్లేందుకు దంపతులు సిద్ధమయ్యారు.

కాగా లాక్ డౌన్ కారణంగా ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో తమ స్వస్థలానికి చేరుకునేందుకు సోమవారం ఉదయం కాలినడకన ప్రారభించారు. ఈక్రమంలో కొంత దూరం వెళ్లాక నిండు గర్భిణి పరిస్థితి స్పందించిన న ఓ లారీ డ్రైవర్ సదరు దంపతులను సూర్యాపేట వరకు తీసుకెళ్లి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సూర్యాపేట నుంచి మళ్లీ కాలినడకన బయలుదేరిన దంపతులు ఖమ్మం జిల్లా కూసుమంచి చేరుకుంటున్న క్రమంలో స్థానిక ఎంఆర్‌ఒ శిరీష, ఎస్‌ఐ అశోక్‌లు గమనించారు. ఆపై వారి పరిస్థితిని అడిగితెలుసుకున్నారు.

తొమ్మిది నెలల నిండు గర్భిణి అప్పటికే 100 కిలోమీటర్లకు పైగా నడిచిందని తెలుసుకున్న సదరు అధికారులు కన్నీటిపర్యంతోపాటు దంపతుల పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే గర్భిణిని పునరావాస కేంద్రంలో వసతి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చి వెంటనే . ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. గర్భిణికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాన్పుల విభాగంలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. దీనావస్థలో ఉన్న ఒడిశా దంపతులను మానవత్వంతో ఆదుకుని ఆపన్నహస్తం అందించిన ఎంఆర్‌ఒ, ఎస్‌ఐల ఔదారాన్ని ప్రతిఒక్కరూ ప్రశంసించారు.

A pregnant woman walked 100 kilometers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News