Monday, April 29, 2024

నిండు కుండలా జలాశయాలు

- Advertisement -
- Advertisement -
పలు ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద నీరు
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

హైదరాబాద్:  గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో పలు జలశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామబాద్, మహబూబ్‌నగర్ ,తదితర జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.గడ్డెన్నవాగు ప్రాజెక్టు నిండా నీరు చేరడంతో నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగానే నీరు చేరింది. దీంతో అధికారులు నాలుగు రోజుల క్రితం ఒక గేటును ఎత్తి వరద నీటిని సుద్దవాగులోకి వదిలారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుండి భైంసా పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని అన్నిగ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నల్లా నీరు అందుతుంది. అంతేగాకుండా పంటల సాగుకు సైతం ఉపయోగిస్తారు. ప్రధాన కాలువ సరియైన రీతిలో లేకపోవడంతో అనుకున్న రీతిలో సాగు అందక అత్యవసర సమయంలో మాత్రం పంటలకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి ప్రజలు ప్రాజెక్టుకు తరలివచ్చి తిలకిస్తున్నారు. అక్కడ ప్రజల రద్దీ సాయంత్రం వేళలో కనిపిస్తుంది. అదే విధంగా సిరికొండ మండలంలోని వరదతో చెరువులు , కుంటలు నిండుతున్నాయి. ఇప్పటికే అన్ని చెరువులు నిండిపోయి నాలుగు పోస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. భారీ వర్షాలకు రైతులు పోరాటనిచ్చాయి. కొందరికి రైతులకు పంట నష్టం జరిగింది. ఈ వానకాలం సీజన్ అదిలో వానలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. పత్తి విత్తనాలు మొలకెత్తని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో గత మూడు రోజులుగా కురుస్తున్నా వర్షాలకు రైతులు పత్తి విత్తనాల మొలకెత్తి రైతులు ఆనందంగా ఉన్నారు. మండల పరిధిలోని సిరికొండ చెరువు, వాయిపేట్ చెరువు, కొండాపూర్ చెరువు, పోచంపెల్లి చెరువు, పాండు గూడా చెరువు, వర్షపు నీరు భారీగా చేరి చెరువు మొత్తం నుండి అలుగు పోస్తున్నాయి. వానలు సమృద్దిగా పడుతుండటంతో పత్తి మొక్కజొన్న వరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని దాదాపు అన్ని గ్రామాలలో పత్తి పంట విత్తనాలు వేశారు. ఈ నేపథ్యంలో చెరువుల కింద అక్కడక్కడ మాత్రమే ఇప్పటి వరకు వరినాట్లు పడ్డాయి. చెరువులో నీరు చేరడంతో రైతులకు వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతంది. భారీ వర్షం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్థార్ వర్ణ హెచ్చరించారు.అంతే కాకుండా మహబూబ్‌నగర్‌లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుండి వరద జూరాలకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో అధికారుల ఆదేశాలమేరకు ఆదివారం 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ముందస్తుగా విద్యుదుత్పత్తిని ప్రారంభించి నీటిని సద్వినియోగం చేసుకుంటామని అధికారులు తెలిపారు.నిండుకుండలా జూరాల జలాశయం జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు కర్ణాటక రాష్ట్రం నుంచి దిగువకను నీటిని విడుదల చేయడంతో జూరాల జళాశయానికి భారీగా వరద నీటి చేరిక ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రానికి జూరాలకు 37,930 క్కూసెక్కులు వరద నీరు రావడంతో జూరాల గరిష్టస్థాయి నీటి మట్టం 318.070 మీటర్ల స్థాయికి చేరువకావడంతో జూరాల ప్రాజెక్టు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్‌ల జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఆదివారం సాయంత్రానికి జూరాల జళాశయంలో 9.657 టీఎంసీల నీటిమట్టానికి 8.750 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భీమా లిప్టు 1కు 1,300, నెట్టెంపాడు లిప్టుకు 1,500, ఎడుమ కాలువ ఆయకట్టుకు 820, భీమా లిప్టు(2) 750, సమాంతర కాలువకు 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా మొత్తం జూరాల నుంచి 42,469 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి ఎగువ నుండి వరద కొనసాగుతుంది.

ఆదివారం సాయంత్రం వరకు 27 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టిఎంసిలు కాగా ఆదివారం సాయంత్రం నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 1083.30 అడుగులు 61.766 టిఎంసిలుగా ఉందని ఏఈఈ మాణిక్యం తెలిపారు. ప్రాజెక్టు నుండి ఆవిరి రూపంలో 530 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథకు 152 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్ రిజర్వాయర్ నీటిమట్టం 1087.700 అడుగులు 75.465 టిఎంసిలుగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News