Tuesday, April 30, 2024

సంక్షేమానికి సంపూర్ణ బలం

- Advertisement -
- Advertisement -

welfare

 

ఎస్‌సి, ఎస్‌టిల కోసం ప్రత్యేక ప్రగతి నిధి, బిసి, మైనారిటీ, మహిళా సంక్షేమానికి భారీగా నిధులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసన సభలో 2020-2021 ఏడాదికి ప్రవేశపెట్టినన వార్షిక బడ్జెట్‌లో దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు భారీగా నిధులను కేటాయించారు. గత ఏడాది వార్షిక బడ్జెట్ 2019-2020 ప్రతిపాదనల కంటే అధిక మొత్తాలను అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. గత ఏడాది బడ్జెట్ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొవడం ద్వారా రాష్ట్రంలో దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాల్లో సామాజీక న్యాయం పొందారని, అభ్యున్నతి చెందారని శాసన సభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో నేటికి ఎస్‌సి, ఎస్‌టిల అత్యంత పేదరికం అనుభవిస్తున్నారు.

ఈ మేరకు ఎస్‌సి వర్గాల ప్రజల విద్య, సామాజిక, ఆర్థిక న్యాయం, రాజకీయ వికాసం ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎస్‌సి, ఎస్‌టీ గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. ఈ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి టిఎస్ ఫ్రైడ్, సిఎంఎస్‌టీ పథకాలను ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు రూ.338 కోట్లు నిధులు వ్యయం చేస్తారు. అలాగే ఈ వర్గాలకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యా నిధి కింద అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా అర్హులకు రూ.20లక్షలను ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. ఎస్‌సిల ప్య్రతేక ప్రగతి నిధి కోసం రూ.16,534.97 కోట్లు, ఎస్‌టీల ప్రత్యేక ప్రగతి నిధి రూ.9,771.27 కోట్ల కేటాయించారు. గత ఏడాది(201920) వార్షిక బడ్జెట్‌లో ఎస్‌సి వర్గాలకు రూ.11,872.38 కోట్ల్లు, ఎస్‌టిల రూ.7,135.80 కోట్లు మాత్రమే కేటాయించారు.

బిసిల అభ్యున్నతికి రూ.4,356.82 కోట్లు
రాష్ట్రంలోని బిసి వర్గాలకు వెన్నుదన్నుగా బడ్జెట్‌లో రూ.4,356.82 కోట్లు కేటాయించారు. చేనేత కార్మికులకు నూలు, రసాయనాలు, రంగుల మీద 50శాతం సబ్సిడీ అందిస్తారు. బీసీల కల్యాణి లక్ష్మి పథకం అమ లు చేయడానికి రూ.1350 కోట్లు నిధులను కేటాయించారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన అత్యంత వెనుకబడిన వర్గాల కార్పొరేషన్(ఎంబిసి) కు రూ.500 కోట్లు నిధులను కేటాయించారు. రాష్ట్రంలోని ఎస్‌సి,ఎస్‌టిల తరహా మైనారిటీ వర్గాల సంక్షేమానికి రూ.1,518. 06 కోట్ల నిధులను ప్రతిపాదించారు.

ఇమాం, మౌజన్‌లకు ప్రతి నెల రూ.5వేల గౌరవభృతితో పాటు రంజాన్,క్రిస్మస్ పండుగలకు వేభవంగా నిర్వహించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మైనారిటీ విద్యార్థులకు 71 జూనియర్ కాలేజీలను ప్రారంభిస్తారని తెలిపారు. మహిళా, శిశు సంక్షేమానికి రూ.1,548.20 కోట్ల నిధులను ప్రతిపాదించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద మంజూరు చేయడానికి రూ.1,200 కోట్లు నిధులు కేటాయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకానికి ఈ సారి బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పథకం కార్యచరణకు గాను రూ.10,500.00 కోట్లను కలిపి రూ.11,916.59 కోట్లను ప్రతిపాదించారు.

ప్రగతి చక్రానికి రూ.1000 కోట్లు
టిఎస్‌ఆర్‌టిసిని ప్రగతి పథంలో నడిపించేందుకు గాను పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచారు. అలాగే కార్గొ పార్సీల్ సర్వీసులను ప్రారంభించారు. ఈ సారి బడ్జెట్‌లో రూ.1,000 కోట్ల నిధులను కేటాయించారు.

 

Absolute strength for welfare
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News