Saturday, April 27, 2024

ఎసిబి వలలో ఉపాధి హామీ ఎపిఒ..

- Advertisement -
- Advertisement -

bribe

 

కామారెడ్డి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అదనపు జిల్లా కార్యక్రమ సమన్వయకర్త(ఎపిఒ) లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని భవానీపేట కాంట్రాక్టర్‌ నర్సారెడ్డి ఆరెపల్లి గ్రామంలో స్మశానవాటికలు నిర్మించాడు. దీనికి సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని ఎపిఒ రాజేందర్ ని కాంట్రాక్టర్‌ నర్సారెడ్డి కలిశాడు. అయితే, బిల్లులను మంజూరు చేయాలంటే తనకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని రాజేందర్ డిమాండ్‌ చేశాడు. దీంతో నర్సారెడ్డి ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. నర్సారెడ్డి మొదటగా పది వేలు లంచం ఇస్తుండగా ఎసిబి దాడి చేసి రాజేందర్ ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ACB Officials Caught APO taking bribe in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News